Weather Report | భానుడి భగభగలు.. ఐదు రోజులు భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

<p>Weather Report | ఎండల తీవ్రత పెరుగుతున్నది. దాంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకురావొద్దని తెలిపింది. […]</p>

Weather Report | ఎండల తీవ్రత పెరుగుతున్నది. దాంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకురావొద్దని తెలిపింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. అయితే, ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతున్నది. దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1901 తర్వాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైందని, . దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయని వివరించింది.