Karnataka Speaker | క‌ర్ణాట‌క స్పీక‌ర్ ప‌ద‌వి ఎవ‌రికంటే?

యూటీ ఖాద‌ర్ వైపు కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేష‌న్ వేయ‌నున్న‌మైనార్టీ నేత‌! విధాత‌: కర్ణాట‌క అసెంబ్లీ స్పీక‌ర్‌ (Karnataka Speaker)గా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత యూటీ ఖాద‌ర్ ఎన్నిక కానున్నారు. ఈ మేర‌కు టీవీ చానెల్స్‌ నివేదిక‌లు వెల్ల‌డించాయి. ఖాద‌ర్ నామినేష‌న్‌కు కాంగ్రెస్ అధిష్టానం సైతం అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. 53 ఏండ్ల ఖాద‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీలో డిప్యూటీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేతగా ప‌నిచేశారు. ఒక‌వేళ కాంగ్రెస్ హైక‌మాండ్ ఖాద‌ర్‌ను స్పీక‌ర్‌గా నియ‌మిస్తే.. మైనార్టీ సామాజిక‌ వ‌ర్గం నుంచి […]

  • Publish Date - May 23, 2023 / 05:50 AM IST

  • యూటీ ఖాద‌ర్ వైపు కాంగ్రెస్ అధిష్టానం
  • నేడు నామినేష‌న్ వేయ‌నున్న‌మైనార్టీ నేత‌!

విధాత‌: కర్ణాట‌క అసెంబ్లీ స్పీక‌ర్‌ (Karnataka Speaker)గా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత యూటీ ఖాద‌ర్ ఎన్నిక కానున్నారు. ఈ మేర‌కు టీవీ చానెల్స్‌ నివేదిక‌లు వెల్ల‌డించాయి. ఖాద‌ర్ నామినేష‌న్‌కు కాంగ్రెస్ అధిష్టానం సైతం అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం.

53 ఏండ్ల ఖాద‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీలో డిప్యూటీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేతగా ప‌నిచేశారు. ఒక‌వేళ కాంగ్రెస్ హైక‌మాండ్ ఖాద‌ర్‌ను స్పీక‌ర్‌గా నియ‌మిస్తే.. మైనార్టీ సామాజిక‌ వ‌ర్గం నుంచి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన‌ మొద‌టి వ్య‌క్తిగా ఆయ‌న నిలుస్తారు.

నేడు ఖాద‌ర్ నామినేష‌న్‌!

అధిష్ఠాన దూత‌లైన కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ ర‌న్‌దీప్ సుర్జేవాలా, జాతీయ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ఇటీవ‌ల ఖాద‌ర్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఖాద‌ర్‌తో స్పీక‌ర్ పోస్టు ఎంపిక అంశంపై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. స్పీక‌ర్ పోస్టు కోసం త‌న నామినేష‌న్‌ను మంగ‌ళ‌వారం ఖాద‌ర్ స‌మ‌ర్పించే అవ‌కాశం ఉన్న‌ది. అవ‌స‌రం అయితే, బుధ‌వారం స్పీక‌ర్ పోస్టుకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు.

గ‌తంలో స్పీక‌ర్ పోస్టుపై చ‌ర్చోప చ‌ర్చ‌లు

స్పీక‌ర్ పోస్టు ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం గ‌తంలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులైన ఆర్‌వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్‌, టీబీ జ‌య‌చంద్ర‌, బ‌స‌వ‌రాజు రాయ‌రెడ్డి, బీఆర్ పాటిల్‌, కేఎన్ రాజ‌న్న‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. చివ‌ర‌కు ఖాద‌ర్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. అయితే, ఖాద‌ర్ ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలోని మంగ‌ళూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Latest News