కాజల్ ఒప్పుకుంటుందా..? లైన్లో ఎవరున్నారు..?
విధాత: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తయింది. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రం తండ్రీ కూతుర్ల అనుబంధం ఆధారంగా రూపొందుతోంది.
రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందే హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలకృష్ణకు జోడిగా వీరసింహారెడ్డిలో నటించి మెప్పించిన హనీరోజ్‌నే తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆవిడ కాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకునే అవకాశం ఎవరెవరికి ఉంది? అనే చర్చ సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ అంటే అభిమానులు నిరుత్సాహపడటమే కాదు మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంతకంటే గతి లేదా? అనే కామెంట్స్ వస్తాయి.
ఆమె తప్పించి మరెవ్వరు ఒప్పుకోలేదనే వార్తలు నెగటివ్‌గా మారుతాయి. దాంతో హనీరోజ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్, సీనియర్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, నయనతార పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా కాజోల్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
కానీ దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాలి. గతంలో రెండు సార్లు బాలయ్యకు జోడిగా నటించడానికి కాజల్ అగర్వాల్ నో చెప్పింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది. బాలయ్య సినిమాకు ఓకే అని చెప్పి ఉంటే మాత్రం ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ ని తొలి సారి జోడీగా చూసే అవకాశం లభిస్తుంది.
అయితే ఈ చిత్రంలో బాలయ్య తండ్రిగా శ్రీలీల కూతురిగా నటిస్తున్నది. దాంతో బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ బాలయ్య సరసన నటించడమే కాదు.. శ్రీలీలకు తల్లిగా కూడా కనిపించాల్సి ఉంటుంది. ఈ పోటీలో చివరికి బాలయ్యకు జోడీగా ఎవరిని తీసుకుంటారు? బాలయ్యకి జోడీ అయితే ఎవరైనా ఇబ్బంది లేదు.
కానీ ఇందులో బాలయ్యకు జోడీగా నటించే నటి శ్రీలీలకు తల్లిగా కనిపించాల్సి రావడమే అసలు సమస్యగా, ఈ చిక్కుముడికి మూలంగా మారుతోంది. దాంతో ఈ చిత్రానికి బాలయ్య జోడీ ఎంపిక క్లిష్టతరంగా మారుతోంది. మరలా హనీరోజ్‌నే తీసుకుంటారా? లేదా కాజల్ అగర్వాల్, సోనాక్షి సిన్హా, ప్రియాంక జవాల్కర్ వంటి వాళ్లు ఓకే చెప్తారా అనేది వేచి చూడాలి..!