High Court | స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామ‌కంలో జాప్యం ఎందుకు?: హైకోర్టు

High Court | స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై హైకోర్టులో విచార‌ణ‌ నాలుగు వారాలు స‌మ‌యం కోరిన ప్ర‌భుత్వం విచార‌ణ‌ను వాయిదా విధాత‌, హైద‌రాబాద్ : సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖ‌లు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధ‌వారం విచారణ చేపట్టింది. ప్ర‌ధాన‌, రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామ‌కంలో ఎందుకు జాప్యం జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వాన్ని […]

  • Publish Date - August 23, 2023 / 01:57 PM IST

High Court |

  • స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామ‌కంపై హైకోర్టులో విచార‌ణ‌
  • నాలుగు వారాలు స‌మ‌యం కోరిన ప్ర‌భుత్వం
  • విచార‌ణ‌ను వాయిదా

విధాత‌, హైద‌రాబాద్ : సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖ‌లు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధ‌వారం విచారణ చేపట్టింది.

ప్ర‌ధాన‌, రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామ‌కంలో ఎందుకు జాప్యం జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. వెంట‌నే క‌మిష‌న‌ర్ల నియామ‌కం చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భుత్వ త‌రుఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని, స‌మాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలంటూ న్యాయ‌ స్థానాన్ని కోరారు. అప్ప‌టిలోగా క‌మిష‌న‌ర్ల నియామ‌కం చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి సూచిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది.

Latest News