మన దేశంలోని ఒక గ్రామంలో ఒక వింత ఆచారం అమలులో ఉంది. ఆ ఊరిలో స్త్రీలు బట్టలు ధరించరు. భార్యాభర్తలు మాట్లాడుకోకూడదు. కనీసం చూసి నవ్వకూడదు. అలా ఎలా ఉండగలుగుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది.. అసలు ఆచారం ఎలా ప్రారంభమైంది తెలుసుకుందాం…
Women don’t wear clothes |
విధాత: మనదేశంలోని హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులు జిల్లా (Kullu Dist)లోని పిని గ్రామం (Pini Village)లో ఒక వింత ఆచారం ఉన్నది. అదేమిటంటే ఏడాదిలో 5 రోజుల పాటు ఆ గ్రామంలోని పురుషులకు (Men), స్త్రీలకు(Women) వేర్వేరుగా కొన్ని నియమాలు అమలులో ఉన్నాయి. వాటిని తూచ తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే కీడు కలుగుతుందని, అరిష్టం సంభవిస్తుందని ఆ గ్రామ వాసులు బలంగా నమ్ముతారు.
పురుషులు పాటించాల్సిన నియమాలు…
భర్తలు వారి భార్యతో అస్సలు మాట్లాడకూడదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉండాలట. కనీసం చూసి నవ్వకూడదట. అంతేకాదు.. ఎవరూ మద్యం ముట్టుకోకూడదు. మాంసం తినకూడదు. ఈ నియమం సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే. అందుకే కష్టమైనా తప్పకుండా పాటిస్తారు.
Marriage | వరుడికి షాక్.. కట్నం సరిపోలేదని పెళ్లి క్యాన్షిల్ చేసిన వధువు
స్త్రీల నియమాలు..
మహిళలు మాత్రం అసలు బట్టలే వేసుకోకూడదట. ఇంటి పనుల నుంచి ప్రతీ పని బట్టలు లేకుండానే చేయాలట. ఇంటి నుంచి బయటకు రారు. అలా చేయకపోతే అరిష్టమని, కీడు జరుగుతుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. వారికే కాదు తమ గ్రామానికి హాని కలుగుతుందని బలంగా నమ్ముతారట.
అయితే ప్రస్తుతం మాత్రం కొంతమంది స్త్రీలు పలుచటి చున్నీ లాంటివి కప్పుకుంటున్నారట. నేటి తరం యువత మాత్రం ఈ సంప్రదాయాన్ని పెద్దగా ఆచరించడం లేదట. పెద్ద వారు మాత్రం ఈ ఆచారాన్నినేటికీ తూచ తప్పకుండా పాటిస్తున్నారట.
Topless swimming allowed । అక్కడ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో ‘టాప్‌లెస్’ ఓకే
ఈ సంప్రదాయం ఎలా వచ్చిందంటే..?
పిని గ్రామంలో చాలా కాలం క్రితం రాక్షసులు తిగుతూ మహిళల దుస్తులను చింపేసి ఎత్తుకెళ్లేవారట. రాక్షసుల భారి నుంచి గ్రామస్తులను కాపాడేందుకు లహువా ఘోండ్ అనే దేవత గ్రామానికి వచ్చి.. రాక్షసులను సంహరించిందట. దీంతో రాక్షసుల పీడ పోయింది. ఈ సంఘటన భాద్ర పద మాసం తొలి రోజు జరిగిందట.
ఆ సంఘటన నుంచి ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు స్త్రీలు దుస్తులు ధరించ కూడదనే ఆచారం సంప్రదాయమైందట. స్తీలు రంగురంగుల దుస్తుల్లో అందంగా కనిపిస్తే రాక్షసులు వచ్చి ఎత్తుకు పోతారని ప్రజలు నమ్ముతారట. ఆ ఐదు రోజులు బయట వ్యక్తులు గ్రామంలోకి రావడం నిషిద్ధమట.
drunken groom । ఫుల్లుగా మందేసి పెళ్లిపీటలపైనే వరుడి నిద్ర.. పెళ్లికూతురు రియాక్షన్?