Site icon vidhaatha

World Kebab Day | నేడు వ‌ర‌ల్డ్ క‌బాబ్స్ డే.. తేదీ, చ‌రిత్ర, ప్రాముఖ్య‌త.. ఇదిగో!

World Kebab Day

విధాత‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక్కో రోజుకు ఒక్కో ప్ర‌త్యేక‌త‌, ప్రాముఖ్య‌త‌, విశిష్ట‌త ఉన్న‌ది. ఇలా సంవ‌త్స‌రం పొడ‌వునా 365 రోజులు సెల‌బ్రేట్ చేసుకొనేలా ప్ర‌త్యేక డేలు ఉన్నాయి. ఈ రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. వ‌ర‌ల్డ్ క‌బాబ్స్ డే. క‌బాబ్స్ అంటే ఎవ‌రికి ఇష్ట‌ముండ‌దు. లేత యాట మాంసం ముక్క‌లు లేదా నాటు కోడి ముక్క‌ల‌కు మాంచి మాసాల ప‌ట్టించి, కొద్దిసేపు అలాగే ఉంచి క‌ణ‌క‌ణ‌మండే నిప్పులపై సీకుతో కుచ్చుని మాంసం ముక్క‌ల‌ను ఎర్ర‌గా కాల్చి.. చ‌ల్లార్చి వాటిపై చిన్న నిమ్మ‌కాయ ముక్క‌ పిండి.. ఆ ముక్క ఒక్కొక్క‌టి నోట్లో వేసుకొని న‌ములుతుంటే.. ఉంటుంది నా సామిరంగా.. క‌బాబ్ టేస్టంటే.. అంటే టేస్టే!! వీటిని ఎక్క‌డైనా ఎలాంటి వాతావ‌ర‌ణంలో అయినా సిద్ధం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌బాబ్‌లు ఇష్ట‌ప‌డ‌ని మాంసాహార ప్రియులు ఉండ‌రంటే ఆశ్చ‌ర్చ‌పోవాల్సిన ప‌నిలేదు. ప్రపంచ కబాబ్ డే అంటే.. ప్ర‌తి ఒక్క‌రూ తృప్తిగా, హాయిగా, రుచికరంగా కాల్చిన మాంసం ముక్కల‌ను ఆర‌గించే వేడుక.

శాఖాహారుల‌కు సైతం క‌బాబ్‌లు

శాఖాహార ప్రియులు కూడా క‌బాబ్స్‌ను టేస్ట్ చేస్తున్నారు. వారి కోసం సోయాబీన్ కబాబ్స్‌, పనీర్ కబాబ్స్‌ను కొన్ని రెస్టారెంట్లు ప్ర‌త్యేకంగా త‌యారుచేస్తున్నాయి. మీ కుటుంబంతో క‌లిసి రాత్రి వేళ ఇంట్లో త‌యారు చేసిన క‌బాబ్స్‌ను ఆర‌గించ‌వ‌చ్చు. లేదా రెస్టారెంట్ల‌లో కూడా ఎక్క‌డైనా, ఎప్పుడైనా క‌బాబ్స్ వినియోగ‌దారుల కోసం సిద్ధంగా పెడుతున్నారు.

ఎప్పుడు జ‌రుపుకుంటారంటే..

ప్ర‌తి సంవ‌త్స‌రం జూలై నెల రెండో శుక్ర‌వారాన్ని వ‌ర‌ల్డ్ క‌బాబ్స్ డేగా జ‌రుపుకుంటారు. ఏడాది జూలై 14న.. అంటే ఈ రోజు శుక్ర‌వారం నిర్వ‌హించుకోవాలి. ఇక ఎందుకు ఆల‌స్యం.. కబాబ్స్‌కు తిన‌డానికి సిద్ధం కండి!

చరిత్ర ఏమిటంటే..

మధ్య-ప్రాచ్య దేశాల్లో ఈ దినోత్స‌వం మొద‌ట‌ ఉద్భవించిందని నమ్ముతారు. మధ్యప్రాచ్యం, మధ్యధరా, దక్షిణాసియా దేశాల‌ వంటకాల్లో కబాబ్స్ కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆ ఆహారాన్ని వారు ఎంతో ఇష్టంగా భుజిస్తారు. వివిధ ర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో, అనేక రకాల మాంసాల‌తో వీటిని వండుతారు. ప‌ళ్లెంలో క‌బాబ్స్ పెట్టుకొని ఆర‌గిస్తుంటే ఆ మజా వేరుగా ఉంటుంది.

కబాబ్స్ ప్రాముఖ్యత..

క‌బాబ్స్ డే నాడు ప్రజలు చికెన్, మటన్, పనీర్‌తోపాటు ఇతర రకాల కబాబ్‌లను ఆనందిస్తారు. క్లాసిక్ సీక్ కబాబ్ నుంచి ఫలాఫెల్ ర్యాప్ వరకు, కబాబ్‌ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఒక్కో ప్లేవ‌ర్ ఇష్ట‌ప‌డుతారు. ప్రపంచ కబాబ్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. మీ ప్రియమైన వారిని ఇంటికి ఆహ్వానించి, వేడివేడి కబాబులు తింటూ.. ముచ్చ‌ట్లు పెట్టుకుంటూ చల్లని ఈ వర్షాకాల వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు

Exit mobile version