పార్లమెంటు ఎన్నికల్లో ఓటేసిన ప్రపంచ అతి చిన్న మహిళ

పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో ప్రపంచంలో అతి చిన్న మహిళ తన ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామిక చైతన్య స్ఫూర్తిని చాటింది.

  • Publish Date - April 19, 2024 / 02:41 PM IST

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో ప్రపంచంలో అతి చిన్న మహిళ తన ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామిక చైతన్య స్ఫూర్తిని చాటింది. ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా (62.8 సెంటీమీటర్లు ) గిన్నిస్ బుక్ ఎక్కిన నాగాపూర్‌కు చెందిన జ్యోతి ఆంగే (30) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం తాను ఓటు వేసినట్లుగా సిరా చుక్క పెట్టిన వేలును చూపుతూ తన ఉత్సాహాన్ని మీడియాతో పంచుకున్నారు.

Latest News