Yarlagadda Venkata Rao |
- మళ్ళీ అదే వంశి మీద పోటీ చేస్తారా?
విధాత: లోకేష్ పాదయాత్ర కృష్ణ జిల్లాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో టిడిపికి ఒక శుభసూచిక రాబోతోందా ? వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు టిడిపిలో చేరబోతున్నారా ? చూస్తుంటే అలాగే ఉంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశి చేతిలో ఓడిపోయినా యార్లగడ్డ వెంకట రావు ఇప్పుడు టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఆయన్ను ఆహ్వానించి అక్కడే టిడిపి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి యార్లగడ్డ వెంకటరావు మీద గెలిచిన వంశి ఆ తరువాత చంద్రబాబుతో విభేదించి జగన్ పక్షాన చేరారు. దీంతో గన్నవరంలో వంశీ పెత్తనం పెరిగింది. ఓడిపోయిన వెంకట్రావు మెల్లగా గన్నవరం రాజకీయాల్లో వెనుకబడ్డారు. మరోవైపు వంశీ దూకుడు ముందు యార్లగడ్డ నిలవలేకపోవడం. పోనీ వంశీని తీసుకున్నందుకు ఈయనకు ఏదైనా పదవి ఇవ్వడమో.. ఇంకేదైనా హామీ అయినా ఇస్తే ఒకతీరుగా ఉండేది.
కానీ అదేం లేకుండా కనీసం ఎపాయింట్మెంట్ ఇవ్వకుండా తనను జగన్ చిన్న చూపు చూస్తున్నారు అని యార్లగడ్డ ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో అయన టిడిపిలో చేరేందుకు మార్గం క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడుతూ తనను పార్టీలో అవమానిస్తున్నారని, తనను కోవర్ట్ మాదిరి చూస్తున్నారని, తానూ ఏనాడూ టీడీపీ వాళ్లతో టచ్ లో లేనని అయినా తనను అనుమానిస్తున్నారని ఆవేదన చెందారు.
ఇదే టైములో తనకు టిడిపి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అటు జగన్ పులివెందుల నుంచి అసెంబ్లీకి వస్తారని, తాను సైతం ఈసారి వంశీని ఓడించి అసెంబ్లీకి వస్తానని అక్కడే తాను జగన్ను కలుస్తానని అన్నారు. లోకేష్ పాదయాత్రలో అయన టిడిపిలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.