విధాత: ఎన్నికలకు సమాయత్తమవుతున్న (YSRCP Campaign) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) మొన్నటి వరకూ గడప గడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్లగా ఇప్పుడు ఇంకో కొత్త ప్రోగ్రాంకు రూపకల్పన చేసారు.
ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే పేరుతో భారీ ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో 7లక్షల మంది పార్టీ కార్యకర్తలు 14 రోజుల్లో (ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20) రాష్ట్రంలోని 1.6 (కోటి అరవై లక్షల) కోట్ల కుటుంబాలను.. 5 కోట్ల మంది ప్రజలను కలిసి ‘మెగా సర్వే’ చేయనున్నారు.
“ఈ 7 లక్షల మంది కార్యకర్తల్లో కొత్తగా నియమితులైన గృహ సారధులు, వార్డు సచివాలయం కన్వీనర్లు ఉంటారు. వీరు ఇంటింటికి ‘మెగా సర్వే’ నిర్వహిస్తారు. వీరంతా గత 3-4 నెలలుగా పార్టీ కేంద్ర కార్యాలయం, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు ఎమ్మెల్యేలతో కనెక్ట్ అవ్వడమే కాకుండా మండలాల వారీగా శిక్షణ పొందారు.
ఇందులో భాగంగా వారంతా ప్రతి ఇంటికి వెళ్లి
1. గత TDP ప్రభుత్వానికి.. ప్రస్తుత YSRCP పాలనను పోల్చి చెప్పే పాంప్లెట్ అందిస్తారు
2. ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేస్తారు
3. మద్దతు తెలిపిన వారికీ డోర్ మరియు మొబైల్ స్టిక్కర్లు ఇస్తారు.
4. పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటే 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు
ప్రజా మద్దతు పుస్తకం (మెగా సర్వే)
“కరపత్రాల పంపిణీ అనంతరం ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలను అడిగి ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహిస్తారు, ఈ ప్రశ్నల ద్వారా ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అనే ప్రశ్నలు అడిగి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు.
‘జగనన్నే మా భవిష్యత్తు’ స్టిక్కర్లు & మిస్డ్ కాల్ ప్రచారం
“సీఎం జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలకు జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరిస్తూ రసీదు ఇవ్వనున్నారు. అనంతరం ప్రజల అనుమతితో జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను తలుపు, సెల్ ఫోన్ స్టిక్కర్లను అతికించనున్నారు.
చివరగా ప్రజలు జగనన్నకు తమ మద్దతును తెలిపేందుకు 82960-82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతారు. రాష్ట్రంలోని 100% కుటుంబాలను రికార్డు స్థాయిలో 14 రోజుల్లో కవర్ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.