అసోంలో అతిసారం వ్యాధితో 11 మంది మృతి

అస్సాం రాష్ట్రంలో టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్‌ లో అతిసార వ్యాధి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కేవలం వారం వ్యవధిలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు.

  • Publish Date - May 23, 2024 / 07:00 PM IST

విధాత : అస్సాం రాష్ట్రంలో టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్‌ లో అతిసార వ్యాధి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కేవలం వారం వ్యవధిలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, సరైన తాగునీరు లేకపోవడంతో అతిసార వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

టీ ఎస్టేట్‌లో వారం వ్యవధిలోనే 11మంది కార్మికులు అతిసార వ్యాధి కారణంగా మరణించడంపై కేంద్రం, అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌లు వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని అంచనా వేయాలని అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టిన్సుకియా జిల్లా కమిషనర్‌ను ఆదేశించారు. అతిసార వ్యాప్తి కారణంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సాయం అందించాలన్నారు. మరోవైపు అస్సోం ఎమ్మెల్యే రూపేష్‌ గోవాలా కూడా టీ ఎస్టేట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Latest News