Site icon vidhaatha

Lions | న‌డిరోడ్డుపై మృగ‌రాజుల రాజ‌సం.. ఇరువైపుల ఆగిపోయిన ట్రాఫిక్‌.. వీడియో

Lions | అడవికి రాజుగా సింహాన్ని పిలుస్తారు. అలాంటి మృగరాజు( Lions ) జూలు విదిల్చి అడవి( Forest )లో నడుస్తుంటే ఎవరైనా భయపడాల్సిందే. మిగ‌తా జంతువులు కూడా వాటిని ప‌సిగ‌ట్టి త‌ప్పించుకు తిరుగుతుంటాయి. మ‌రి అంత‌టి భ‌యంక‌ర‌మైన మృగరాజు.. జ‌నావాసాల్లోకి వ‌స్తే గుండెల్లో దడ పుట్టాల్సిందే.

గుజ‌రాత్‌లోని అమ్రేలి జిల్లాలోని రాజులా – పిపావావ్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఒకట్రెండు సింహాలు కాదు.. ఏకంగా 9 సింహాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఆ సింహాల గుంపును చూసిన ప్ర‌యాణికులు త‌మ వాహ‌నాల‌ను అల్లాంత దూరనా ఆపేశారు.

సింహాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. కాసేప‌టికి అవి రోడ్డు ప‌క్క‌కు వెళ్లిపోయాయి. న‌డిరోడ్డుపై మృగరాజులను చూసిన వాహ‌న‌దారులు త‌మ కెమెరాల్లో బంధించారు. ఆ సింహాల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి..

Exit mobile version