Site icon vidhaatha

Viral Video | ట్రాఫిక్ పోలీసును కాలితో త‌న్ని దాడి చేసిన మ‌హిళ‌..

Viral Video |  ఓ మ‌హిళ( Woman ) రెచ్చిపోయింది. ట్రాఫిక్ నిబంధ‌న‌లు( Traffic Rules ) పాటించ‌కుండా.. ఉల్టా పోలీసుల‌పైనే దాడికి పాల్ప‌డింది. బూతులు తిడుతూ ట్రాఫిక్ పోలీసుల( Traffic Police ) ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్( Viral Video ) అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క( Karnataka ) రాజ‌ధాని బెంగ‌ళూరు( Bengaluru )లోని ఈఎస్ఐ హాస్పిట‌ల్( ESI Hospital ) జంక్ష‌న్ అది. ట్రాఫిక్ పోలీసులు త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌ని వారికి కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్నారు. అయితే ఓ మ‌హిళ వాహ‌నాన్ని కూడా పోలీసులు ఆపారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్ప‌డంతో ఆమె ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

హిందీ( Hindi )లో మాట్లాడిన ఆమె పోలీసుల‌ను బూతులు తిట్టారు. త‌న కాలితో పోలీసును త‌న్నింది. చివ‌ర‌కు ట్రాఫిక్ పోలీసు వ‌ద్ద ఉన్న కెమెరాను కూడా లాగేసుకునే ప్ర‌య‌త్నం చేసిందామె. ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల విసుగు చెందిన పోలీసులు ఎఫ్ఐఆర్( FIR ) న‌మోదు చేశారు. ఆమెను సోన‌మ్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది.

Exit mobile version