Site icon vidhaatha

Madhya Pradesh : కామంతో కట్టు తప్పిన ఖాకీలు..బార్ డ్యాన్సర్లతో చిందులు

Madhya Pradesh Police Officer

విధాత : ఉద్యోగ పరంగానే కాకుండా సామాజికంగా కూడా క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులు మద్యం మత్తులో కామోద్రేకంతో రెచ్చిపోయి బార్ డ్యాన్సర్లతో(Bar Dancer’s) చిందులేసిన ఘటన వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సహోద్యోగి ఓ కానిస్టేబుల్ పుట్టిన రోజు వేడుకల్లో ఎఎస్ఐతో పాటు ఓ కానిస్టెబుల్ ఫుల్ గా తాగేసి..మద్యం మత్తులో బార్ డ్యాన్సర్లతో చిందులేసి అసభ్యంగా వ్యవహరించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మేల్కొని విచారణకు ఆదేశించాను.

బార్ డ్యాన్సర్లతో కింద మీద పడి అనుచితంగా వ్యవహరించిన పోలీసులు దతియా పోలీస్‌ స్టేషన్‌(Datia Police Station) చెందిన సిబ్బందిగా గుర్తించారు. పోలీస్(Police) శాఖ పరువు తీసేలా వ్యవహరించిన ఎఎస్ఐ(ASI), కానిస్టేబుల్(Constable) ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

 

 

Exit mobile version