బిగ్ ఆపరేషన్..రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారం సీజ్

అస్సాంలో భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టైంది. గౌహతి పోలీసులు రూ.55 కోట్ల విలువైన 37 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాలు పెంచడంతో… దేశంలోకి అక్రమ మార్గాల్లో బంగారం రవాణా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో అక్రమ బంగారం భారీగా పట్టుబడిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

అస్సాం రాష్ట్రంలోని ఖర్‌ఘులిలో నిర్వహించిన సోదాల్లో గౌహతి పోలీసులు రూ. 55 కోట్ల విలువైన 37 కిలోల 24-క్యారెట్ల బంగారాన్ని, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రకు చెందిన 32 ఏళ్ల అక్షయ్ బన్సోడేను అరెస్టు చేశారు. అతను గత రెండు నెలలుగా గౌహతిలో ఉంటున్నాడని, గతంలో 20 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. బంగారం అక్రమ రవాణపై కేసు నమోదు చేసిన అధికారులు…నిందితుడికి అంతర్జాతీయ బంగారం స్మగ్లర్లతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest News