Cab Driver Income | ఈ క్యాబ్‌ డ్రైవర్‌ సంపాదన తెలిసిన ప్రయాణికుడి మైండ్‌ బ్లాక్‌..! సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌..!

Cab Driver Income | ప్రస్తుత కాలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అందరూ క్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో దాంతో క్యాబ్‌ డ్రైవర్లకు ఆదాయం పెరిగింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ రోజువారీ ఆదాయం తెలుసుకొని ఓ ప్రయాణికుడి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.

  • Publish Date - July 1, 2024 / 09:00 AM IST

Cab Driver Income | ప్రస్తుత కాలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అందరూ క్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో దాంతో క్యాబ్‌ డ్రైవర్లకు ఆదాయం పెరిగింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ రోజువారీ ఆదాయం తెలుసుకొని ఓ ప్రయాణికుడి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. వెయ్యి కాదు రెండువేలు కాదు.. రోజుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు సంపాదిస్తున్నానని డ్రైవర్‌ చెప్పడంతో ఆ ప్రయాణికుడు షాక్‌కు గురయ్యారు. అంతే కాదు క్యాబ్‌ను రెంట్‌కు ఇవ్వడంతో అదనంగా మరింత ఆదాయాన్ని పొందుతున్నానని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు.

ఇందుకు సంబంధించి ఆ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో క్యాబ్‌ బుక్‌ చేశాడు. క్యాబ్‌ డ్రైవర్‌తో మాట్లాడుతున్న సమయంలో ఆదాయంపై చర్చ వచ్చింది. ప్రయాణికుడి అడిగి ప్రశ్నకు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ సమాధానమిస్తూ రోజుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు సంపాదిస్తున్నానని తెలిపాడని.. దాంతో తాను షాక్‌కు గురయ్యానని ఆ ప్రయాణికుడు చెప్పాడు. రోజుకు రూ.3వేలు సంపాదించినా నెలలో 25 రోజులు పని చేసినా రూ.75వేలు అవుతుందని.. డీజిల్ ఖర్చులు తీసేసినా అతని ఆదాయం బాగానే ఉందని తెలిపారు. క్యాబ్‌ను ఓలాకు రెంట్‌కి ఇచ్చి అదనంగా ఆదాయాన్ని పొందుతున్నానని చెప్పాడని సదరు ప్రయాణికుడు ‘రెడ్డిట్‌’లో పోస్ట్‌ పెట్టారు. కొద్దిరోజుల కిందట చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. క్యాబ్ డ్రైవర్ ఆదాయంపై పలువురు నెటిజన్లు సైతం స్పందించారు.

ఇందులో వాస్తవం ఉందని.. తమకు తెలిసిన వారు సైతం ఇదే తరహాలో సంపాదిస్తున్నారని తెలిపారు. డీజిల్ ఖర్చులు, ఈఎంఐలు మినహాయించినా పెద్ద మొత్తంలోనే మిగులుతుందని చెప్పారు. కొందరు డ్రైవర్లు ఇండ్లు సైతం కట్టుకున్నారని.. తనకు పరిచయం ఉన్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ రెంకరాల పొలం కొనుగోలు చేశాడని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ పేర్కొన్నారు. అందులో ఆశ్చర్యం ఏముంది? కష్టపడుతున్నాడు కాబట్టి సంపాదిస్తున్నాడని మరో యూజర్‌ పేర్కొన్నాడు. చాలా కష్టపడుతుంటారని, రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలతో ఒత్తిడి ఉంటుందని, చాలా అలసిపోతుంటారని మరికొందరు యూజర్లు తెలిపారు.

Latest News