రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న సమయంలో రైలు దూసుకరావడంతో ఓ తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన ఇద్దరు పిల్లలను కాపాడిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనలో వారితో పాటు మరో ఇద్దరు మహిళల ప్రాణాలు కూడా రక్షించబడ్డారు. ఈ వీడియో చూస్తున్న వారికి రోమాలు నిక్కబోడుచుకునే ఉత్కంఠ లోనవ్వగా..ఆ తల్లి సాహసాన్ని, త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌లోని షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్‌కు సంబంధించినది. అక్కడ ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే పట్టాలను దాటుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఒక రైలు వేగంగా దూసుకొచ్చింది. దాంతో ఆ మహిళలు వెంటనే ఫ్లాట్ ఫామ్ కు ఆనుకుని కింద కూర్చుని, పిల్లలను తమ శరీరాల కిందకు ఒత్తుకుని అదిమిపట్టుకున్నారు. ఆ రైలు వారి మీదుగా వెళ్ళిపోయినప్పుడు ఆ మహిళకు గాయాలు కూడా అయ్యాయి.
వారిని గమనించిన ప్రయాణికులు ఫ్లాట్ ఫామ్ పై నుంచే.. రైలు వారి శరీరాలను తాకినప్పుడు దాని కిందకు వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నారు. ఈ వీడియో చూసిన వారికి ఆ రైతు మృత్యుశకటంగా కనిపిస్తూ..వారి ప్రాణాలతో ఉంటారో లేదోనన్న ఉత్కంఠతను కల్గించింది. అయితే ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలతో బయటపడటం మహిళల ధైర్య సాహసాలు..త్యాగ గుణంతో పాటు భూమి మీద వారికి ఇంకా నూకలు ఉండటమేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
इस मां ने जान की परवाह किये बिना, अपने दो बच्चों की जान बचा ली। साथ में दो महिलाएं और थीं उनकी जान भी बच गयी।
वायरल वीडियो बिहार के शाहपुर पटोरी रेलवे स्टेशन का है, जहां तीन महिलाएं दो बच्चों को साथ लेकर रेलवे लाइन क्रॉस कर रही थीं। तभी ट्रेन आ गयी, महिलाएं बच्चों सहित मलहरा के… pic.twitter.com/Q6OigPMdMT
— Abhimanyu Singh (@Abhimanyu1305) May 15, 2026
ఇవి కూడా చదవండి :
ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి
ప్రియురాలి మోసం..యువకుడి ఆత్మహత్య
