Cow follow Traffic Rules | ఆ ఆవుకు ఉన్న తెలివి వాహ‌న‌దారుల‌కు లేక‌పాయే..! వీడియో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!!

Cow follow Traffic Rules | మన‌షుల‌తో పోల్చితే జంతువులు బెట‌ర్ అని చాలా సంద‌ర్భాల్లో పెద్ద‌లు చెబుతుంటారు. ఎందుకంటే మూగ‌జీవాలు తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రమే పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తూ, మ‌న‌షుల‌కు ఆటంకం క‌లిగిస్తుంటాయి. మూగ‌జీవాలు ఎంత తెలివిగా ఉంటాయో అన‌డానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం.

  • Publish Date - June 27, 2024 / 10:45 PM IST

Cow follow Traffic Rules | మన‌షుల‌తో పోల్చితే జంతువులు బెట‌ర్ అని చాలా సంద‌ర్భాల్లో పెద్ద‌లు చెబుతుంటారు. ఎందుకంటే మూగ‌జీవాలు తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రమే పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తూ, మ‌న‌షుల‌కు ఆటంకం క‌లిగిస్తుంటాయి. మూగ‌జీవాలు ఎంత తెలివిగా ఉంటాయో అన‌డానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం.

ఎందుకంటే చాలా మంది వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌రు. రెడ్ సిగ్న‌ల్ ప‌డిన‌ప్ప‌టికీ.. సిగ్న‌ల్ జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కొంద‌రైతే ట్రాఫిక్ నిబంధ‌న‌లు మ‌రిచి సిగ్న‌ల్ వ‌ద్ద ఉన్న లైన్‌ను దాటి త‌మ వాహ‌నాల‌ను నిలుపుతారు. ఇక‌ లెఫ్ట్ సైడ్ వెళ్లాల‌నుకునే వారికి కూడా దారి ఇవ్వ‌కుండా అడ్డంగా వాహ‌నాల‌ను నిలిపి.. ఇత‌ర వాహ‌న‌దారుల‌కు ఆటంకం క‌లిగిస్తుంటారు.

అయితే ఓ ఆవు మాత్రం త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించింది. ఓ జంక్ష‌న్ వ‌ద్ద రెడ్ లైట్ ప‌డ‌గానే ఆ ఆవు ముందుకు క‌ద‌ల‌కుండా, ట్రాఫిక్ లైన్ దాట‌కుండా అలానే నిలిచిపోయింది. ఇక అక్క‌డున్న కొంత మంది వాహ‌న‌దారులు మాత్రం పూర్తిగా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారు. ట్రాఫిక్ లైన్‌ను దాటి ముందుకు నిలిపారు త‌మ వాహ‌నాల‌ను. దీంతో కొంద‌రు ఆ ఆవుకున్న తెలివి వాహ‌న‌దారుల‌కు లేక‌పాయే క‌దా.. అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ సంఘ‌ట‌న పుణెలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియోను పుణె ట్రాఫిక్ పోలీసులు బుధ‌వారం త‌మ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అటెన్ష‌న్ గాయ్స్.. రెడ్ లైట్ ప‌డ్డ‌ప్పుడు వాహ‌నాల‌ను ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు పోలీసులు.

Latest News