విధాత: దేశాన్ని నియంతృత్వం నుంచి రక్షించడానికి తాను జైలు వెళ్తుండటం సంతోషంగా ఉన్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తనను ఎంత హింసించినా లొంగిపోను అన్నారు. ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం సుప్రీంకోర్టు తనకు 21 రోజుల మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. రేపు నేను తిరిగి జైలుకు వెళ్తాను. వీళ్లు (బీజేపీని ఉద్దేశించి) ఎంత కాలం నన్ను జైలులో ఉంచుతారో తెలియదు.
కానీ నా శక్తులు బలంగా ఉన్నాయి. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడటానికి నేను జైలు వెళ్తుండటం ఆనందంగా ఉన్నదన్నారు. నన్ను అణిచివేయడానికి, నేను మాట్లాడకుండా వాళ్లుఅనేక విధాలుగా ప్రయత్నించారు కానీ విజయవంతం కాలేదు. నేను జైలు ఉన్నప్పుడు అనేకరకాలుగా హింసించారు. నాకు మందులు అందకుండా చేశారు. వాళ్లకు ఏం కావాలో నాకు అర్థం కాలేదు. ఎందుకు వాళ్లు ఇలా చేశారో తెలియదు.
मैं देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं। मुझे इस बात का गर्व है।
👉मैं बेशक आपके बीच में नहीं रहूंगा, लेकिन मैं आपके एक भी काम नहीं रुकने दूंगा।
👉मैंने आपको अपना परिवार मानकर ख़्याल रखा। अब आप लोग मेरे बुजुर्ग और बीमार माता-पिता का ख़्याल रखियेगा।@ArvindKejriwal… pic.twitter.com/oXrEZrMNXn
— AAP (@AamAadmiParty) May 31, 2024
నేను జైలుకు వెళ్లేటప్పుడు నేను 70 కిలోలు ఉన్నాను, ఇప్పుడు 64 కిలోలకు తగ్గాను. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నేను బరువు పెరగడం లేదు. నా శరీరంలో తీవ్రమైన జబ్బు ఏదో ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు. చాలా పరీక్షలు చేయాల్సి ఉన్నదన్నారు. నేను లొంగిపోవడానికి మధ్యాహ్నం 3 గంటలకు నా ఇంటి నుంచి వెళ్తాను. ఇప్పుడు మళ్లీ వాళ్లు మరోసారి నన్ను ఇంకా ఎక్కువగా హింసించే అవకాశం ఉన్నది. అయినా నేను బతికున్నంతకాలం లొంగిపోను అన్నారు.
ఢిల్లీ కోసం పనిచేయం ఆపను అని స్పష్టం చేశారు. మీకు అందిస్తున్న ఉచిత విద్యుత్, మోహిల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులు, ఉచిత మెడిసిన్, చికిత్స, 24 గంటల విద్యుత్‌తో పాటు ఇతర పథకాలన్నీ కొనసాగుతాయి. అలాగే నేను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి తల్లి, సోదరికి రూ.1000 అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నా కుటుంబ కోసం నేను మిమ్నల్ని ఒకటి అడుగదలుచుకున్నాను. నా తల్లిదండ్రులు వృద్ధులు. నా తల్లి అనారోగ్యంతో ఉన్నది. నేను జైలులో ఉండగా ఆమె గురించే ఆందోళన చెందాను. నేను జైలుకు వెళ్లాక నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ల కోసం ప్రార్థించండి’ అని కేజ్రీవాల్ ఉద్వేగంగా మాట్లాడారు.