Site icon vidhaatha

ఈవీఎంల హ్యాకింగ్‌కు ఎలన్ మస్క్‌ను భారత్‌కు పిలవాలి … బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరీ

విధాత, హైదరాబాద్ : ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరీ మండిపడ్డారు. భారత్‌లో ఈవీఎంలను ఎంతమంది ప్రయత్నించినా హ్యాకింగ్ చేయలేరన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న ఎలన్ మస్క్‌ను భారత్‌కు పిలిపించి హ్యాకింగ్ చేసి చూపించాలని కేంద్రం అడగాలని సూచించారు. ఇప్పటికే భారత్‌లోని ఈవీఎంలు అనేక పరీక్షలను అధిగమించి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంల పనితీరుపై భారత్‌లో పలు రాజకీయ పార్టీలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓడిన పార్టీలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ఏపీలో ఓడిపోయిన మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంల పనితీరుపై సందేహాపడ్డారు. ఆధారాలు లేనందునా ఏమి చేయలేమంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చన్న ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత్‌లోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ వంటివంటూ విమర్శలు చేశారు.

Exit mobile version