- పశ్చిమ బెంగాల్ హౌరాలో అగ్ని ప్రమాదం
విధాత: పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న గోదాములో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరాలోని షిబ్‌పూర్ ఫోర్సా రోడ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఉదయం 11 గంటల వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పక్కనే పెట్రోల్ బంక్ ఉన్నందున బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
#WATCH | Howrah, West Bengal: Fire broke out in a warehouse located next to a petrol pump in the Shibpur Forsa Road area of Howrah. 10 fire tenders are at the spot to douse the fire pic.twitter.com/cSkvWsFjhw
— ANI (@ANI) November 10, 2023
ఉదయం వేళ పెట్రోల్‌బంక్‌కు సమీపంలో ఉన్న గోదాము నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులతోపాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పడానికి పది అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ బయటకు వస్తున్నది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.