Site icon vidhaatha

మ‌ధ్యంత‌ర‌ బెయిల్‌ ముగియడంతో మళ్లీ జైలుకు.. కేజ్రీవాల్‌

kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయి మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన బెయిల్‌ గడువు ముగియడంతో ఆదివారం తీహార్‌ జైలులో లొంగిపోయారు. ఆయనకు రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 5 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. అంతకు ముందు కేజ్రీవాల్‌ తన భార్య సునీతతో కలిసి కన్నాట్‌ ప్లేస్‌లోని హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధిని సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని తీహార్‌ జైలు నుంచే నడిపించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఆప్‌ ప్రకటించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించేందుకు వీలు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ చెప్పారు.

Exit mobile version