రోడ్లపై ఈడియట్స్‌కు కొదవలేదు! అని ఒక యాడ్‌లో ఉంటుంది! వీరు కూడా అందుకు తక్కువ కాదనేలా ఒక వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతున్నది. బైక్‌లపై విన్యాసాల వీడియోలు, ముద్దుల వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అప్పటికి అవి వారికి సరదా కలిగించినా.. అప్పుడప్పుడు పోలీసులు వారి సరదాను జరిమానాల రూపంలో తీర్చేస్తుంటారు. ఇలాంటి కథే ఇది. రోడ్లపై ప్రయాణించే సమయంలో మనం ప్రయాణించే తీరు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. కానీ.. కొందరు అవేవీ పట్టించుకోకుండా దూసుకుపోతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక జంట ఇలానే.. బైక్‌పై దూసుకుపోయారు. అయితే.. సదరు అమ్మాయి సదరు అబ్బాయి వైపు తిరిగి గట్టిగా కౌగలించుకుని ఉండగా.. ఆ బైక్ రోడ్డుపై దూసుకుపోయింది. కనీసం హెల్మెట్లు కూడా వారు పెట్టుకోలేదు. దీనిని ఒకరు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వెంటనే వైరల్ అయిన ఈ వీడియో.. పోలీసుల దృష్టిలో పడింది. ఈ ఘటన సింభావులి పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదవ నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. మోటర్ వెహికల్స్ చట్టం కింద.. ఆ బైక్ నడిపిన యువకుడికి 8 వేల రూపాయల ఫైన్ విధించారు పోలీసులు. అంతేకాదండోయ్.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమించారు