Site icon vidhaatha

Shoe Garland | రూ. 40 వేలు చోరీ.. దొంగ‌కు చెప్పుల దండేసి ఊరేగించిన పోలీసులు.. వీడియో

Shoe Garland | ఇది అమాన‌వీయ ఘ‌ట‌న‌.. చ‌ట్టం ప్ర‌కారం శిక్ష విధించాల్సిన పోలీసులు.. బ‌హిరంగంగా అమాన‌వీయ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. చోరీ చేసినందుకు ఓ దొంగ‌కు చెప్పుల దండేసి ఊరేగించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు తీవ్రంగా స్పందించారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఓ మెడిక‌ల్ షాపు వ‌ద్ద రోగి అటెండ‌ర్ మందులు కొనుగోలు చేస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి ఓ దొంగ చేరుకుని, రోగి అటెండ‌ర్ జేబులో నుంచి రూ. 40 వేలు కొట్టేశాడు. అనంత‌రం అక్క‌డ్నుంచి దొంగ పారిపోయాడు. ఈ ఘ‌ట‌న కొద్ది రోజుల క్రితం జ‌ర‌గ్గా.. బాధిత వ్య‌క్తికి ఇటీవ‌ల ఓ ఆస్ప‌త్రి ప‌రిస‌రాల్లో దొంగ క‌నిపించాడు. దీంతో అత‌డిని వెంబ‌డించాడు.

భ‌క్షి న‌గ‌ర్ పోలీసులు కూడా అప్ర‌మ‌త్త‌మై ఆ దొంగ‌ను అరెస్టు చేశారు. ఇక పోలీసులు దొంగ‌ను అర్ధ‌న‌గ్నంగా చేశారు. అంత‌టితో ఆగ‌కుండా పోలీసు బానెట్‌పై దొంగ‌ను కూర్చోబెట్టి.. అత‌ని మెడ‌లో చెప్పుల దండేశారు. ఆ త‌ర్వాత జ‌మ్మూ ప‌ట్ట‌ణంలోని వీధుల్లో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

పోలీసుల తీరుపై కొంద‌రు స్థానికులు తీవ్రంగా మండిప‌డ్డారు. చ‌ట్టం ప్ర‌కారం శిక్షించాల్సింది పోయి.. ఇలా చెప్పుల దండేసి ఊరేగించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు కూడా సీరియ‌స్‌గా స్పందించారు. విచార‌ణ‌కు ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. అనంత‌రం చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు.

Exit mobile version