Site icon vidhaatha

digital payments for South Central Railway tickets |  రైల్వే టికెట్ల కొనుగోలులో క్యూఆర్ కోడ్ డిజిటల్ చెల్లింపులు

అన్ని స్టేషన్లకు విస్తరించినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

విధాత, హైదరాబాద్ : రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలుకు క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు(Digital payments through QR code for purchase of tickets) చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలులో చిల్లర కష్టాలు తీరనున్నాయి. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే(At major railway stations) ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అన్ని స్టేషన్లకూ విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్‌లో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి(Using the QR code at the reservation counter) ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పేర్కొంది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు(Like holding a special device) తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్ చేశాక.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తవ్వగానే టికెటు అందిస్తారు. సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే(Major railway stations like Secunderabad) పరిమితమైన క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని(Cashless facility) జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజ్‌లను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్, టెక్నికల్ సిబ్బందిని (Commercial and technical staff)దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కొనియాడారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Exit mobile version