Shakira Waka Waka Rajasthani Version | ‘వెల్‌కమ్ టు రాజస్థాన్‌’.. షకీరా వాకా వాకా పాటను ప్రత్యేక వెర్షన్‌లో పాడిన జానపద కళాకారులు.. ఆకట్టుకుంటున్న వీడియో

షకీరా ‘వాకా వాకా’కు రాజస్థానీ తడకా! ‘వెల్‌కమ్ టు రాజస్థాన్’ అంటూ జానపద కళాకారులు పాడిన పాట ఇప్పుడు నెట్టింట సెన్సేషన్.

Shakira Waka Waka Rajasthani Version

పాప్ సింగర్ ‘క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్’గా పేరు పొందిన షకీరా (Pop Singer Shakira) తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె పాడిన పాటకు అంత క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఆమె పాడిన ఫిపా వరల్డ్ కప్ అధికారిక పాట ‘వాకా వాకా’కు ఉన్న క్రేజ్‌ వేరే లెవెల్‌ అనే చెప్పాలి. ఈ పాట ట్యూన్‌ యువతను ఉర్రూతలూగించింది. డ్యాన్స్‌ రానివాళ్లతో కూడా కాలు కదిపేలా చేస్తుంది. ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా..? ఇంతటి ప్రపంచ ఫేమస్‌ పాటను మన రాజస్థానీ జానపద కళాకారులు (Rajasthani folk artists) ప్రత్యేకమైన వెర్షన్‌లో పాడి ఆకట్టుకున్నారు మరి. అందుకే ఇప్పుడు ఈ పాటను గుర్తు చేయాల్సి వస్తోంది.

ఇస్మాయిల్ లంగా గ్రూప్‌కు చెందిన రాజస్థానీ జానపద కళాకారులు షకీరా హిట్‌ పాట అయిన ‘వాకా వాకా’ ప్రత్యేకమైన వెర్షన్‌ పాడారు. సాంప్రదాయ రాజస్థానీ సంగీతం, సంస్కృతిని జోడించి ఈ పాటను మిక్స్‌ చేశారు. పాట సాహిత్యంలోని ‘వెల్‌కమ్‌ టు ఆఫ్రికా’ స్థానంలో ‘వెల్‌కమ్ టు రాజస్థాన్‌’ జోడించి పాడారు. ఈ మోడిఫైడ్ వెర్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మన కళాకారులు పాడిన ఆ పాటను మీరూ చూసేయండి మరి.

Video Link :

ఇవి కూడా చదవండి :

Jharkhand Encounter| జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్..10మంది మావోయిస్టులు మృతి
Gold, Silver price fall| భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Latest News