Gold, Silver price fall| భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హెచ్చు తగ్గుల దోబుచులాటాడుతున్న బంగారం, వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.2,290తగ్గి.. రూ. 1,54,310వద్ద ఆగింది. ఆల్ టైమ్ రికార్డులతో దూసుకపోతున్న కిలో వెండి ధరలు గురువారం అనూహ్యంగా రూ.5000తగ్గి రూ.3,40,000వద్ద కొనసాగుతుంది
విధాత, హైదరాబాద్ : హెచ్చు తగ్గుల దోబుచులాటాడుతున్న బంగారం, వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.2,290తగ్గి.. రూ. 1,54,310వద్ద ఆగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100తగ్గి ..రూ.1,41,450వద్ద నిలిచింది. యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు, గ్రీన్ ల్యాండ్ స్వాధీనం వివాదంతో పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగిరావడంతో కొనుగోలుదారులు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపేందుకు అనుకూల పరిణామం ఏర్పడింది. గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి అమెరికా చర్చల మార్గం పట్టడంతో ప్రస్తుతానికి అంతర్జాతీయంగా కొంత ఉద్రిక్తతలు శాంతించాయి. ప్రస్తుత పరిస్థితుల మేరకు బంగారం మరికొన్ని రోజులు తగ్గే ఛాన్స్ ఉన్నప్పటికి..ఫిబ్రవరి మాసంలో శుభకార్యాలు ప్రారంభంకానుండటంతో మరోసారి బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. 2025లో బంగారం 64 శాతం పెరగగా, 2026లో ఇప్పటివరకు 11 శాతం లాభపడింది.
దిగొచ్చిన వెండి ధరలు
ఆల్ టైమ్ రికార్డులతో దూసుకపోతున్న కిలో వెండి ధరలు గురువారం అనూహ్యంగా రూ.5000తగ్గి రూ.3,40,000వద్ద కొనసాగుతుంది. గతం 10రోజులలో ఇదే అత్యధిక తగ్గుదల కావడం విశేషం. భారీగా పెరిగిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంపై మార్కెట్లో జోరుగా చర్చ సాగుతోంది. మునుముందు పెరుగుతుందా, లేక తగ్గుతుందా అన్న సందేహాలను రేకెత్తిస్తుంది. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ ఔన్సుకు 3.6 శాతం తగ్గి 91.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం మాత్రమే ఇది రికార్డు స్థాయిలో 95.87 డాలర్లను తాకడం గమనార్హం.
స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ పరిణామాలు వెండి, బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ట్రంప్ గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి సంబంధించి యూరోపియన్ దేశాలపై విధించాలనుకున్న సుంకాల బెదిరింపులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చింది. ఈ నిర్ణయంతో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గి వెండి, బంగారం ధరలపై ఒత్తిడి తగ్గినట్లుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ల బలం కొనసాగితే స్వల్పకాలంలో వెండి మరింత దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram