Site icon vidhaatha

Maoists Encounter : చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టుల మృతి

six-maoists-killed-in-chhattisgarh-encounter

విధాత : చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ- బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతాబలగాలు ఎదురుపడ్డాయి. ఈ సందర్భంగా నెలకొన్న ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..మరికొందరు గాయపడినట్లుగా భద్రతాధికారులు వెల్లడించారు.

తాజా ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సంఘటనా స్థలంలో ఆయుధాలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version