బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు సోనియా ఘ‌న‌స్వాగ‌తం.. వారి భేటీలో ఆయ‌న ఫొటో ప్ర‌త్య‌క్షం

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సోనియాతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా హ‌సీనాకు వెల్‌క‌మ్ చెప్పారు. ఈ ముగ్గురిని షేక్ హ‌సీనా ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని, త‌న విషెస్ చెప్పారు.

  • Publish Date - June 10, 2024 / 07:34 PM IST

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సోనియాతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా హ‌సీనాకు వెల్‌క‌మ్ చెప్పారు. ఈ ముగ్గురిని షేక్ హ‌సీనా ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని, త‌న విషెస్ చెప్పారు.

అనంత‌రం సోనియా, రాహుల్, ప్రియాంక‌… బంగ్లాదేశ్ ప్ర‌ధాని హ‌సీనాతో పాటు వారి బృందంతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో సోనియా, హ‌సీనా మ‌ధ్య ఓ అరుదైన ఫొటో ప్ర‌త్య‌క్ష‌మైంది. షేక్ హ‌సీనా తండ్రి షేక్ ముజిబుర్ ర‌హ్మ‌న్ ఫొటోను ఈ స‌మావేశంలో క‌నిపించింది. అయితే భార‌త్ – బంగ్లాదేశ్ బంధాన్ని బ‌లోపేతం చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌పై వారు విస్తృతంగా చ‌ర్చించారు. విశ్వాసంతో ప‌రస్ప‌ర స‌హ‌కారం అందించుకోవాల‌ని, అప్పుడే వృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు.


ఈ ఏడాది జ‌న‌వ‌రిలో షేక్ హ‌సీనా(76) బంగ్లాదేశ్‌కు ఐదోసారి ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యారు. ఇక న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ‌స్వీకారానికి ద‌క్షిణాసియా దేశాల‌కు చెందిన ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం జ‌రిగిన ఈ వేడుక‌కు హ‌సీనా హాజ‌రై మోదీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎల్‌కే అద్వానీని కూడా హ‌సీనా నిన్న క‌లిశారు.

గాంధీ, షేక్ హ‌సీనా కుటుంబం మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. బంగ్లాదేశ్ వ్య‌వ‌స్థాప‌క నాయ‌కుడు, షేక్ హ‌సీనా తండ్రి షేక్ ముజిబ‌ర్ రహ్మ‌న్‌.. నాటి భార‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీతో స‌త్సంబంధాలు క‌లిగి ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. దీంతో బంగ్లాదేశ్‌, భార‌త్ మ‌ధ్య ప‌ర‌స్ప‌ర గౌర‌వాన్ని పెంపొందించింది.

 

 

Latest News