వాధ్రా–గాంధీ ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాధ్రా కుమారుడు రైహాన్ వాధ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో రైహాన్‌కు ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని, ఇక త్వరలోనే పెళ్లికూడా జరుగబోతున్నదని ఏబీపీ వార్తా కథనం పేర్కొంటున్నది. కొన్నేళ్లగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. రైహాన్ ప్రతిపాదనకు రెండు కుటుంబాలు ఆమోదం తెలిపి, ఆశీర్వదించాయని ఆ కథనం సారాంశం. వీరిద్దరూ ఏడేళ్లుగా కలిసి ఉంటున్నారు. అయితే.. ఈ వేడక విషయంలో రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఎంగేజ్‌మెంట్ అంతర్గత వేడుకగా జరిపారని తెలుస్తున్నది.
ఎవరీ అవీవా బేగ్?
ఆమె అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అవీవా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్. ఎంతో నైపుణ్యంతో ఆమె ఫొటోలు తీస్తారని ప్రతీతి. లోతైన భావోద్వేగాలతో కూడిన ఫొటోలను తీయడంతోపాటు.. రోజువారీ జీవితాన్ని నిశ్శబ్ద పరిశీలకుడి దృష్టిలో చిత్రీకరిస్తారని అంటారు. పాఠశాల విద్యను ఢిల్లీలోని మోడ్రన్‌స్కూల్‌లో పూర్తి చేసి అవీవా.. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో పట్టా అందుకున్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా ఆమె తన ఫొటోలతో వేర్వేరు ప్రఖ్యాత వేదికలపై ప్రదర్శించారు. 2023లో మెథడ్ గ్యాలరీలో ‘యూ కెనాట్ మిస్ దిస్’ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 2023లోనే ఆలిండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇచ్చారు. సొంతగా ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా.. అటెలియర్ 11 అనే స్టూడియో, ప్రొడక్షన్ హౌస్‌ను మిత్రులతో కలిసి ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
Komatireddy : సంక్రాంతికి ఆ రూట్ లో టోల్ చార్జీల రద్దు
INSV Kaundinya : వండర్..ఆ ప్రాచీన నౌక మళ్లీ సముద్రంపై ప్రత్యక్షం
