ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే : జేడీయూ

బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్‌డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది

  • Publish Date - June 29, 2024 / 04:32 PM IST

న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్‌డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్‌కుమార్‌ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. శనివారంనాడు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జేడీయూ కార్యవర్గం కోరినట్టు జేడీయూ సీనియర్‌ నాయకుడు న్యూఢిల్లీ- బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎన్‌డీఎ భాగస్వామ్య పక్షమైన జేడీయూ డిమాండు చేసింది. నితీష్‌కుమార్‌ నాయకత్వంలో జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంటుగా ఎన్నుకుంది. వెల్లడించారు. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన సంజయ్‌ సింగ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం. సంజయ్‌ సింగ్‌ రాజ్యసభలో జేడీయూ నాయకుడు కూడా. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, కేంద్ర మంత్రులు లలన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, వివిధ రాష్ట్రాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Latest News