విధాత: గత నెల 27వ తేదీన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 47 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సిట్ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, టీవీకే పార్టీ నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమకు వ్యతిరేకంగా విచారణ జరుపుతున్నారని టీవీకే పార్టీ న్యాయవాదులు వాదించడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై అన్ని పార్టీల అనుమానాలు తొలగాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని, అందువల్లే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ప్రతి నెల కేసు పురోగతిని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
CBI Probe On Karur Stampede | కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ
కరూర్ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. అనుమానాలు తొలగాలంటే ఇది అవసరమని కోర్టు పేర్కొంది.
