విధాత, హైదరాబాద్ : తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఘటనను బాధిత మహిళా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. జర్నిల్ డిసిల్వ అనే 27 ఏండ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై పుణెలోని బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్‌టేక్ చేశాడు. ఒక్కసారిగా స్కూటీ ముందు కారు ఆపి పిల్లల ముందే డిసిల్వపై దాడి చేసి ముక్కుపై పిడిగుద్దులు కురిపించడం ప్రారంభించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది. కారుకు దారివ్వలేదని ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆ వీడియోలో పేర్కొన్నారు. జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా ముఖంపై కొట్టడని చెప్పారు. ఆయనతోపాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. పుణెలో భద్రత ఎక్కుడుందని ప్రశ్నించారు. తనలాగే మరొకరికి జరగొచ్చని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగన పోలీసులు జర్నిల్ ఇంటికి వెళ్లారు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన నిందితుడితోపాటు ఆ సమయంలో కారులో ఉన్న అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pune | పిల్లల ముందే మహిళపై వ్యక్తి దాడి … కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరోపణ
తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడు ఓ వ్యక్తి. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఘటనను బాధిత మహిళా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

Latest News
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక