Truck hits Minister Car | లక్నో : ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి బేబి రాణి మౌర్య( Baby Rani Maurya )కు పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వే( Agra – Lucknow Expressway )పై శుక్రవారం రాత్రి మంత్రి ప్రయాణిస్తుండగా, ఆమె కారును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే మంత్రి బేబి రాణి మౌర్య.. హథ్రాస్ జిల్లాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని లక్నోకు బయల్దేరారు. ఇక ఫిరోజాబాద్ జిల్లాలోని లక్నో – ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా.. ఓ ట్రక్కు టైర్ పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన ఆ ట్రక్కు మంత్రి కారును ఢీకొట్టింది. కారు ధ్వంసమైనప్పటికీ, మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి మౌర్య మరో కారులో లక్నోకు బయల్దేరి వెళ్లారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అయితే కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి గాయాలు లేకుండా ఆమె క్షేమంగా బయటపడ్డారు. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు తీసుకెళ్లాడు. దీంతో కారు కుడివైపు స్వల్పంగా ధ్వంసమైంది. మంత్రికి ఎలాంటి ముప్పు సంభవించకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
परमपिता परमेश्वर की असीम कृपा एवं आप सभी मेरे प्रिय शुभचिंतक, देवतुल्य जनता जनता जनार्दन के असीम आशीर्वाद से आगरा लखनऊ एक्सप्रेसवे पर हुए भीषण सड़क हादसे में सकुशल हूं। pic.twitter.com/xqr9VSFQUc
— Baby Rani Maurya(modi ka parivar) (@babyranimaurya) October 24, 2025
