సింధూ లోయ పశుపతి ముద్రపై కొత్త రచ్చ !

సింధూ లోయ నాగరికత పశుపతి ముద్రలో ఉన్నది శివుడు కాదని అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కే చేసిన వ్యాఖ్యలపై కొత్త వివాదం చెలరేగింది.

సింధూ లోయ నాగరికత నాటి పశుపతి ముద్రపై అంతర్జాతీయంగా మరోసారి చర్చ రేగింది. క్రీ.పూ. 4300ఏళ్ల నాటి సింధూ లోయ నాగరికతకు చెందిన పశుపతి ముద్రలో ఉన్న దేవుడు శివుడు కాదని.. యురేషియా సంస్కృతికి చెందిన ప్రాచీన ఇరాన్ దేవుడు అని అమెరికన్ చరిత్ర కారిణి ఆడ్రీ ట్రష్కే కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఈ ముద్రిక ప్రాచీన ఇరాన్ ప్రాంతానికి చెందిన ప్రోటో ఎలమైట్ కళఖండాలతో పోలి ఉందని వాదించారు.

టుష్కే వాదనను భారతీయ చరిత్ర కారులు ధీటుగా తిప్పికొడుతున్నారు. ఈ ముద్రికపై ఉన్న ఏనుగు, నీటి గేదె, ఖడ్గమృగం వంటివి ప్రాచీన ఇరాన్ లో లేవని, కేవలం భారత్ లో మాత్రం ఉండేవని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ముద్రికలో మనిషి యోగ భంగిమలో ఉన్నాడని, యోగ కూడా ఇరాన్ దే అంటారా అంటూ నిలదీస్తున్నారు.

నిరంతరాయంగా సాగుతున్న భారతీయ ప్రాచీన సాంస్కృతిక వైభవానికి ఈ ముద్రిక సజీవ సాక్ష్యం అని, దీనిపై ఉన్నది పశుపతిగా కొలిచిన శివుడిగా భారత్ గతంలోనే ప్రకటించింది. ముద్రికలో ఉన్నది శివుడు కాదని అమెరికన్ చరిత్ర కారిణి ఆడ్రీ ట్రష్కే చేసిన కొత్త వాదనపై భారతీయ చారిత్రక పరిశోకులు మండిపడుతున్నారు.

హిందూ మతంలో శివుడిని “పశుపతి” (జంతువులకు ప్రభువు) అని పిలుస్తారు. ముద్రపై ఉన్న వ్యక్తి చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె, జింకలు ఉన్నాయి. ముద్రలోని దేవుడు యోగాసనంలో (ముఖ్యంగా పద్మాసనం లేదా మూలబంధాసనం) కూర్చుని ఉన్నాడు. శివుడిని హిందూ సంప్రదాయంలో ఆదియోగిగా వర్ణిస్తారు. ఆ దేవుడి తలపై కొమ్ములతో కూడిన కిరీటం ఉంది. వేదాలలో శివుడిని ‘రుద్రుడు’ అని పిలుస్తారు, ఆయనకు కూడా ఇలాంటి అలంకరణలు ఉంటాయని..అందుకే ముద్రలోని దేవుడు పశుపతి(శివుడు) అని చెబుతున్నరు.

పశుపతి ముద్ర, ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధు లోయ నాగరికతలో భాగమైన ప్రధాన పట్టణ ప్రదేశం మొహెంజో -దారోలో .. బ్రిటిష్ పాలనలో 1928-1929లో జరిగిన తవ్వకాలలో కనుగొనబడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్-జనరల్‌గా పనిచేసి , సింధు లోయ ప్రదేశాల తవ్వకాలకు నాయకత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త జాన్ మార్షల్ ఈ ముద్రపై అనేక కోణాల్లో పరిశోధన చేసి పశుపతి(శివుడి)రూపంగా తేల్చడం విశేషం.

Latest News