Bairabi railway station | మీకు తెలుసా.. ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేష‌న్‌..!

Bairabi railway station | ఇండియా( India )లో ఉన్న రాష్ట్రాల్లో అనేక రైల్వే స్టేష‌న్లు( Railway Stations ) ఉన్నాయి. కానీ ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క రైల్వే స్టేష‌న్ ఉంది. ఇది మీకు ఆశ్చ‌ర్యంగానే అనిపించొచ్చు. కానీ ఇది నిజం. మ‌రి ఆ రాష్ట్రం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.

Bairabi railway station | ఇండియ‌న్ రైల్వేస్( Indian Railways ).. ప్ర‌పంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వ‌ర్క్( Railway Network ). భార‌త‌దేశంలోని చాలా మంది ప్ర‌యాణికులు సుదూర ప్రాంతాల‌కు వెళ్లేందుకు రైళ్ల‌నే ఎంచుకుంటారు. ఈ రైళ్ల‌ల్లో ప్ర‌యాణం కూడా ఎంతో సౌల‌భ్యంగా ఉంటుంది. సుర‌క్షితం కూడా. త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న ప్ర‌యాణం కూడా. కాబ‌ట్టి.. ఈ దేశంలోని స‌గానికి పైగా జ‌నాభా రైళ్ల‌ల్లోనే ప్ర‌యాణిస్తుంటారు.

అయితే అనేక రాష్ట్రాల్లో వంద‌ల కొద్ది రైల్వే స్టేష‌న్లు ఉన్న‌ప్ప‌టికీ ఆ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక్క రైల్వే స్టేష‌న్( Railway Station ) ఉంది. దేశ వ్యాప్తంగా 7,641 రైల్వే స్టేష‌న్లు ఉన్నాయి. ఇందులో అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లో 1,173 రైల్వేస్టేష‌న్లు ఉండ‌గా, మ‌హారాష్ట్ర‌( Maharashtra )లో 779, బీహార్‌( Bihar )లో 768, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌( Madhya Pradesh )లో 550, గుజ‌రాత్‌( Gujarat )లో 509 రైల్వే స్టేష‌న్లు ఉన్నాయి.

మ‌రి ఒకే రైల్వే స్టేష‌న్ ఉన్న రాష్ట్రం ఏంటి..?

ఈ దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేష‌న్ ఉన్న రాష్ట్రం ఏంటంటే.. అది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక‌టైన మిజోరం( Mizoram ). ఈ రైల్వే స్టేష‌న్ పేరు బైరాబి రైల్వే స్టేష‌న్(Bairabi railway station ). ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే చివ‌రి రైల్వే స్టేష‌న్.. అంటే స‌రిహ‌ద్దుకు చివ‌ర్లో ఉంటుంది. బైరాబి రైల్వే స్టేష‌న్ కోడ్ BHRB. ఈ రైల్వే స్టేష‌న్‌లో కేవ‌లం మూడు ప్లాట్‌ఫామ్స్ మాత్ర‌మే ఉన్నాయి. మిజోరంలో ఉన్న 12.25 ల‌క్ష‌ల మంది ఈ రైల్వే స్టేష‌న్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటారు.

బైరాబి రైల్వే స్టేష‌న్( Bairabi railway station ) కోలాసిబ్ జిల్లాలో ఉంది. 84.25 కి.మీ పొడవైన బ్రాడ్-గేజ్ రైల్వే లైన్‌తో అనుసంధానించబడి ఈ స్టేష‌న్ ఉంది. ఇది కటఖల్ జంక్షన్‌( Katakhal Junction )ను బైరాబికి కలుపుతుంది. ఈ రైల్వే లైన్ మార్చి 2016లో పూర్తయింది.