Loveyapa
విధాత: అతిలోక సుందరి శ్రీదేవి మరణానంతరం ఇద్దరు కుమార్తెలు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’ బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా రామ్‌చరణ్‌తోనూ ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లోనూ ఇప్పుడిప్పుడే వరుస ఛాన్సులతో దూసుకుపోతోంది. అయితే చెల్లి ఖుషీ కపూర్ (Kushi Kapoor) మాత్రం ఇప్పుడిప్పుడే సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
గత సంవత్సరం ‘ది ఆర్చిస్’ మూవీతో తెరంగ్రేటం చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘లవ్యప్ప’ మూవీతో తన లక్కును పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో హీరో అమీర్ ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ (Junaid Khan) కాగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీరిద్దరు ఒక్కో చిత్రం చేసినా అవి ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న ఈ చిత్రమే వారి తొలి థియేట్రికల్ రిలీజ్ చిత్రం. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే సినిమా గురించి అమీర్ ఖాన్ (Aamir Khan) మాట్లాడుతూ మూవీకి సంబంధించిన రఫ్ కట్ చూశానని బాగా వచ్చిందన్నారు.
లవ్యప్ప మూవీలో ఎంటర్టైన్ మెంట్‌తో పాటు రొమాన్స్, అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ కారణంగా మన జీవితాలలో వచ్చిన మార్పులు ఏమిటనేది ఈ మూవీలో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఖుషీ కపూర్ గురించి మాట్లాడుతూ.. ఖుషిని చూస్తుంటే నాటి శ్రీదేవి గుర్తొచ్చిందని, శ్రీదేవిలో ఉండే ఎనర్జీ ఖుషీలో చూశానని అమీర్ ఖాన్ అన్నారు. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న లవ్ టుడేకు ఈ మూవీ రీమేక్ అన్నారు. ఈ మూవీకి అమీర్ ఖాన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.