Site icon vidhaatha

Sanya Thakur: టాలెంట్ చూపిస్తున్న.. టాలీవుడ్ ముద్దుగుమ్మ‌

విధాత‌:  మీరు చూస్తున్న ఈ ఫొటోల్లోని ముద్దుగుమ్మ పేరు సాన్యా ఠాకూర్ (Sanya Thakur). 2019లో హృతిక్ రోష‌న్ సూప‌ర్ 30 సినిమాలో బేబ‌మ్మ కృతిశెట్టితో స‌హా స్టూడెంట్‌గా క‌లిసి న‌టించి కెరీర్ ఆరంభించింది. 2023లో నిఖిల్ హీరోగా పాన్ ఇండియాగా వ‌చ్చిన స్పై సినిమాతో ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఒక‌రిగా చేసింది.

అదే ఏడాది రిస్క్ అంటూ మ‌రో తెలుగు సినిమా చేసినా అది రిలీజ్‌కు నోచుకోలేదు. ఇక ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ సైతం చేసింది.

విజ‌య్ దేవ‌రకొండ‌తోనూ ఓ యాడ్‌లో న‌టించింది. ఆపై అవ‌కాశాలు అందుకోలేక పోయిన ఈ అందాల సుంద‌రి సామాజిక మాద్య‌మాల్లో మాత్రం య‌మా చురుకుగా ఉంటూ కుర్ర‌కారులో కాక రేపుతోంది.

అందాల ప్ర‌ద‌ర్శ‌ణ‌లో హ‌ద్దుల‌నేవి లేకుండా నెటిజ‌న్ల‌కు కావ‌ల్సినంత ఫుల్ మీల్స్ వ‌డ్డిస్తోంది. ఈ అందాల‌ను.. ముద్దుగుమ్మ‌ను చూసిన వారంతా ఎప్ప‌టికైనా బిజీ అవడం గ్యారంటీ అని స్ప‌ష్టం చేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు సినిమాల్లో క‌న‌బ‌డ‌క‌బోయినా ఇలా అయినా క‌నులవిందు చేయ‌డం మానొద్ద‌ని సినీ ల‌వ‌ర్స్‌, సాన్య (Sanya Thakur) ఫాలోవ‌ర్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version