విధాత : పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతితో సమావేశమైన అమిత్ షా, జైశంకర్ లు ఉగ్రదాడి పరిణామాలు.. భారత్ తీసుకున్న దౌత్యపర చర్యలను వివరించారు. ఉగ్రదాడి వెనుక పాక్ ప్రమేయాన్ని వివరించారు. పాకిస్తాన్ పట్ల కేంద్రం తీసుకుంటున్న అన్ని చర్యలను రాష్ట్రపతికి తెలియచేశారు.
రాష్ట్రపతిని కలిసిన అమిత్ షా, జైశంకర్
