Site icon vidhaatha

Steve Smith: వన్డేలకు అసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గుడ్ బై!

విధాత, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ వన్డేల(International One-Day)కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్(Australia’s Star Batter) స్టీవ్ స్మిత్ (Steve Smith’s)రిటైర్‌మెంట్(Retirement) ప్రకటించారు. స్టీవ్‌ స్మీత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కెప్టెన్‌గా వ్యవహరించారు . ఈ టోర్నీలో సెమీస్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేల నుంచి రిటైరవుతున్నట్లుగా స్టీవ్ స్మిత్ ప్రకటించారు. పరిమిత ఓవర్ల క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని స్మిత్ పేర్కొన్నాడు.

తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్​లో భారత్​​పై ఓటమి తర్వాత స్మిత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్మిత్ 15ఏళ్లు ఆసీస్​కు ప్రాతినిధ్యం వహించాడు. అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్​లో 169 వన్డే మ్యాచ్​లు ఆడిన స్మిత్ 43 సగటుతో 5727 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015, 2023 వన్డే వరల్డ్​కప్ విన్నింగ్ టీమ్​లో స్మిత్ సభ్యుడుగా ఉండటం విశేషం.

Exit mobile version