Thandel: రికార్డుల‌.. బుజ్జితల్లి! సాయి పల్లవి

onFeb7th  NamoNamahShivaya నాగచైతన్య (chaitanya akkineni), సాయి పల్లవి (Sai Pallavi) హీరో, హీరోయిన్లుగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్‌ (Thandel). కార్తికేయ‌2 వంటి భారీ హిట్ త‌ర్వాత చందూ మొండేటి (chandoo mondeti) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) ఈ మూవీకి సంగీతం అందిస్తుండ‌గా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు ఒకదాన్ని మించి మ‌రోటి చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా […]

onFeb7th  NamoNamahShivaya

నాగచైతన్య (chaitanya akkineni), సాయి పల్లవి (Sai Pallavi) హీరో, హీరోయిన్లుగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్‌ (Thandel). కార్తికేయ‌2 వంటి భారీ హిట్ త‌ర్వాత చందూ మొండేటి (chandoo mondeti) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.

దేవీ శ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) ఈ మూవీకి సంగీతం అందిస్తుండ‌గా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు ఒకదాన్ని మించి మ‌రోటి చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘బుజ్జితల్లి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

యూట్యూబ్‌లో త‌క్కువ స‌మ‌యంలో ఏకంగా 45 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు అందుకుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది.

ఇదే క్ర‌మంలో రీసెంట్‌గా ఇదే సినిమా నుంచి రిలీజ్ చేసిన న‌మో న‌మః శివాయ (Namo Namah Shivaya) లిరిక‌ల్‌ వీడియో సోష‌ల్ మీడియాలో మ‌రో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇదిలాఉండ‌గా ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.