Site icon vidhaatha

వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ

విధాత : రాంగోపాల్ వర్మ దర్శక నిర్మాతగా రూపొందిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది. సినిమాలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులకు దగ్గరి పోలికలు ఉన్న నేపధ్యంలో సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని బోర్డు తెలిపింది.


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జీవితంలో జరిగిన ఘటనలతో ముడిపడిన కథాంశంతో రాంగోపాల్ వర్మ రెండుభాగాలు వ్యూహం, శపథం పేరుతో సినిమాను నిర్మించడం విశేషం. మొదటి భాగం వ్యూహం సినిమాను నవంబర్ 10వ తేదీన విడుదల చేయాలని రాంగోపాల్ వర్మ భావించినప్పటికి సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించడంతో విడుదల సందిగ్దంలో పడింది.

Exit mobile version