Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో తుపాకి బుల్లెట్లు కనిపించడం కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ చెట్ల మధ్య పారిశుధ్య సిబ్బందికి ఓ కవరు లో 13 బుల్లెట్లు కనిపించాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కవర్ తెరిచి చూడగా 9 పెద్ద, 4చిన్న బుల్లెట్లు లభించాయి. కొన్ని పేల్చిన తూటలు. 4 బాంబులు, ఒక ఎస్ ఎల్ ఆర్ తుపాకీ పౌచ్, ఎర్ర జెండా లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంచిలో బుల్లెట్లు ఎవరు వదిలి వెళ్లి ఉంటారనే కోణంలో శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైల క్షేత్రంలో దేవస్థానానికి చెందిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనేక తనిఖీల మధ్య కొండపైకి బుల్లెట్లతో ఎలా వచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నారు.
Srisailam | శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్ల కలకలం
Srisailam | ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో తుపాకి బుల్లెట్లు కనిపించడం కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ చెట్ల మధ్య పారిశుధ్య సిబ్బందికి ఓ కవరు లో 13 బుల్లెట్లు కనిపించాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కవర్ తెరిచి చూడగా 9 పెద్ద, 4చిన్న బుల్లెట్లు లభించాయి. కొన్ని పేల్చిన తూటలు. 4 బాంబులు, ఒక ఎస్ ఎల్ ఆర్ తుపాకీ పౌచ్, ఎర్ర జెండా […]
Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు