Site icon vidhaatha

SRH: పార్క్ హయత్ హోటల్‌లో మంటలు.. SRH ప్లేయర్లకు తప్పిన ప్రమాదం!

విధాత: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పార్క్ హయత్‌ హోటల్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఇదే హోటల్ లో ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీమ్ కు చెందిన దేశ, విదేశీ ఆటగాళ్లు బస్ చేయడంతో అగ్ని ప్రమాద ఘటన సంచలనంగా మారింది.

మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు భారీ స్థాయిలో ఎగిసి పడటంతో దట్టంగా పొగ అలుముకుంది. మంటలు ఇతర గదులకు వ్యాపించకముందే హోటల్ లో ఉన్న ఎస్ ఆర్ హెచ్ ఆటగాళ్లతో పాటు అందరిని ఖాళీ చేయించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలకు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాద సమయంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు 6వ అంతస్తులో ఉన్నారు. మంటలు చెలరేగగానే వారంతా హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో సిబ్బంది, అతిథులు అంతా భయాందోళనలకు గురయ్యారు.

ఎస్ ఆర్ హెచ్ ఆటగాళ్లు బస చేసిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ బస చేసిన ఐపీఎల్ ఆటగాళ్ల భద్రతపై ఫోకస్ పెట్టి బస ఏర్పాట్లపై నిర్వాహకులను, అధికారులను అప్రమత్తం చేసింది.

Exit mobile version