Site icon vidhaatha

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒక‌రు మృతి

విధాత‌: బంజారాహిల్స్ లో శ‌నివారం తెల్ల‌వారుజాము 3 గంటల స‌మ‌యంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ స‌మీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఓ కారు ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది.

ఈ ఘ‌ట‌న‌లో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెంద‌గా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్య‌క్తులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.

Exit mobile version