Site icon vidhaatha

Rains: హైదరాబాద్‌లో.. దంచికొట్టిన వాన

విధాత: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అక్కడక్కడ వడగళ్ల వాన పడింది. అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం పడింది. అక్కడక్కడ కోత కొచ్చిన వరి పంటలు.. మామిడి తోటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం.

హైదరాబాద్ లో పంజాగుట్ట, ఎర్రమంజీల్, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, యూసఫ్ గూడ, కృష్ణానగర్, ,జూబ్లీహిల్స్, బోరబండ, అమీర్ పేట్, సనత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ , సుల్తాన్ బజార్, హిమాయత్ నగర్, నారాయణ గూడ, కోఠిలలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలయయం కాగా..డ్రైనేజీ పొంగి పొర్లాయి. అప్పటిదాక ఎండలతో తల్లడిల్లిన నగర వాసులు ఆకస్మిక వర్షంతో వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

తెలంగాణలో రాగల రేపు శుక్రవారం కూడా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, జనగాం, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

 

Exit mobile version