ponnam Prabhakar: విధాత, హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే.
అనేక నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇంటిని 400- 600 చదరపు అడుగులలోపే నిర్మించుకోవాలని సూచించారు. ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మహిళా సంఘాల నుంచి మీకు లక్ష రూపాయల రుణం అందిస్తుందని స్పష్టం చేశారు.
పది సంవత్సరాల తర్వాత ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని అన్నారు.