IRCTC Best Package: రూ. 13500కే స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం యాత్ర

తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలతోపాటు శ్రీశైలంను చూసి వచ్చేందుకు IRCTC తక్కవ ధరకే మంచి ప్యాకేజీ యాత్రను తీసుకు వచ్చింది. స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం పేరుతో మూడు రాత్రులు నాలుగు రోజులు ఉంటుంది. మంగళ, శుక్రవారాల్లో మినహా అన్ని దినాల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 15న ప్రారంభం కానుంది. మూడు డిన్నర్లు, రెండు బ్రేక్‌ఫాస్టులు వారే ఏర్పాటు చేస్తారు.

ప్యాకేజీ వివరాలు: మొదటి రోజు సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లలో పిక్‌అప్ చేసుకుని హోటల్‌కు తీసుకువెళ్తారు. అనంతరం చార్మీనార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్ చూశాక తిరిగి హోటల్‌కు చేరుకుంటాము. ప్యాకేజీలో భాగంగా డిన్నర్ ఏర్పాటు చేసి రాత్రి బస చేస్తాము. మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు శ్రీశైలంకు బయలుదేరుతాము, బ్రేక్‌ఫాస్ట్ మార్గమధ్యలో మనమే చేయాల్సి ఉంటుంది. ఐదు గంటలు జర్నీ చేశాక శ్రీశైలం చేరుకుంటాము. అక్కడ బ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకున్నాక శ్రీశైలంలోని పరిసరాలను చూపిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి హైదరాబాద్‌లోని హోటల్‌కు చేరుకుంటాము. డిన్నిర్ చేసి రాత్రికి హోటల్‌లోనే బస. ఆ తర్వాత మూడవ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి బిర్లా మందిర్, గోల్కొండ ఫోర్ట్ అనంతరం మధ్యాహ్నం స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ చూసుకుని సాయంకాలం హోటల్‌కు చేరుకుంటాము. రాత్రికి డిన్నర్ చేసి హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక. నాలుగవ రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని హోటల్‌ను వేకేట్ చేసి యాదగిరి గుట్ట వెళ్తాము. అక్కడ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శిచుకుని, పక్కనే ఉన్న సురేంద్రపురి చూస్తాము. సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్‌ల వద్ద వదిలేస్తారు.

టికెట్ ధరలు: ఈ యాత్రకు ఒకరు, లేదా ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి రూ.19890, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి రూ.15010 చొప్పున పడుతుంది. అదే నలుగురు నుంచి ఆరుగురు కలిసి వెళ్తే ఒక్కరికి రూ. 13500 చొప్పున పడుతుంది.
నోట్: మరిని వివరాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.