విధాత: జాకీచాన్ (Jakie Chan) సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరి ఎదురుచూపులకు తెర దించుతూ ఆయన నటించిన కొత్త చిత్రం కరాటే కిడ్ లెజెండ్స్ (Karate Kid Legends) సినిమా విడుదలకు రెడీ అయింది.
ఈ సినిమాకు జోనాథన్ ఎంట్విస్ట్లే దర్శకత్వం వహించగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే వింటేజ్ జాకీచాన్ బ్యాక్ అని అనిపిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా ఆయన ఇందులో నటించాడు.
కాగా ఈ సినిమా 2025 మే 30న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత కొలంబియా పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రైలర్ చూసేయండి మరి.