Site icon vidhaatha

Kaleshwaram HC Case | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీఘోష్ నివేదిక: హైకోర్టులో స్టే కోరుతూ కేసీఆర్, హరీశ్ పిటిషన్

kaleshwaram-pc-ghosh-report-case-kcr-harish-hc

Kaleshwaram HC Case | కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రెండు వేర్వేరు పిటిషన్లను వేశారు. ఈ పిటిషన్లు బుధవారం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. 665 పేజీల రిపోర్టును ముగ్గురు సభ్యుల బృందం అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించారు.ఈ వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు ఇచ్చారు. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో నియమాలు పాటించలేదని రిపోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ రిపోర్టుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారని గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ పై ఒంటికాలిపై మండిపడుతోంది. మరో వైపు ఈ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఏం చేయాలనేదానిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఈ నివేదికపై కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version