Site icon vidhaatha

రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు కోరిన కేఆర్ఎంబీ

విధాత‌: రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికకు మూడు వారాల గడువు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కోరింది. ఈ మేరకు ఎన్జీటీకి కృష్ణా బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన బృందంలో దేవేందర్‌రావు ఉండటంపై గతంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా చూడాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దేవేందర్‌ స్థానంలో మరొకరిని నియమించాలని జలశక్తి శాఖను కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. నామినేట్‌ చేసిన వెంటనే బృందాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తుందని కేఆర్‌ఎంబీ వెల్లడించింది.

Exit mobile version